అయ్యయ్యో ఏంటి..పవన్ చేసిన ఆ పని అభిమానులకి నచ్చట్లేదా..? సీన్ రీవర్స్ అయ్యిందే..!
ఇప్పటివరకు పవన్‌ను ఒక నిర్దిష్ట స్టైల్‌లో చూసి అలవాటు పడిన అభిమానులకు ఈ కొత్త లుక్ కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తోందని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై మిక్స్‌డ్ కాదు… ఎక్కువగా నెగిటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి. ‘పవన్‌కి ఈ లుక్ సూట్ అవ్వడం లేదు’, ‘ముందు లుక్ చాలా బాగుండేది’, ‘ఇది సినిమా కోసమైతే ఓకే కానీ మామూలుగా మాత్రం వద్దు’ వంటి కామెంట్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.ఇక అసలు ఈ లుక్ ఏ సినిమా కోసమో, లేక పవన్ స్వయంగా ప్లాన్ చేసి మార్చుకున్న లుక్‌నా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించిన లుక్ ఇదేనా..? లేక రాబోయే మరే ఇతర సినిమా లేదా ప్రత్యేక పాత్ర కోసం ఇలా ట్రై చేస్తున్నారా..? అనే అనుమానాలు కూడా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది అభిమానులు మాత్రం ‘పవన్ కొంచెం స్లిమ్ అయ్యి, స్టైల్‌లో చిన్న మార్పులు చేస్తే లుక్ పూర్తిగా మారిపోతుంది’ అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ‘ఇది పూర్తిగా సినిమా అవసరాల కోసమే, ఫైనల్ లుక్ చూస్తే అందరూ సైలెంట్ అయిపోతారు’ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా, ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌కు అభిమానుల నుంచి ఆశించినంత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే రావడం లేదు. అయితే పవన్ అంటే పవన్… చివరికి తెరపై కనిపించే మ్యాజిక్‌తో అన్ని విమర్శలను తిప్పికొట్టడం ఆయనకు కొత్త కాదు. ఈ లుక్ తాత్కాలికమా..? లేక సినిమా కోసం ఫిక్స్ అయిన ఫైనల్ లుకేనా..? పవన్ ఇందులో మరే మార్పులు చేస్తారా..? అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.