మొదటిసారి అలాంటి పాత్రలో నటిస్తున్నా : ప్రియా ప్రకాష్ వారియర్

praveen
సాధారణంగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారి పోతూ ఉంటారు కొంతమంది సినీ తారలు. అలాంటి హీరోయిన్లలో ఒకరు ప్రియా ప్రకాష్ వారియర్. వాలెంటైన్స్ డే అనే ఒక చిన్న సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ తన చిన్న కన్నుగీటి తో ఇక భారత సినీ ప్రేక్షకుల అందరిని బుట్టలో వేసుకుంది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించింది ఈ అమ్మడు. అయితే ఇప్పటికే తమిళ కన్నడ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల నితిన్ తో కలిసి చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమా ఆశించిన మేర ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయింది


 ఈ సినిమాలో ఈ అమ్మడు అందానికి మాత్రం  మాత్రం సినీ ప్రేక్షకులను ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. తన క్యూట్ క్యూట్ అందాలతో సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తడుతున్నట్లు  తెలుస్తోంది దీంతో ఈ అమ్మడు మరో సినిమాకు సిద్ధమైంది. ఇక తేజ  సజ్జ హీరోగా రూపొందిన ఇష్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రియా ప్రకాష్ వారియర్. సినిమా ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్ శరవేగంగా జరుగుతుంది ఇందులోభాగంగానే ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఇష్క్ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకొచ్చింది


 ఇష్క్ మూవీ లో తన పాత్ర పేరు అనసూయ అని హీరోయిన్ పాత్ర ఇప్పుడు వరకు మీరు చూడని విధంగా ఎంతో భిన్నంగా ఉంటుంది అంటూ చెప్పింది.  ఇక వెండితెరపై మొదటిసారి ఒక విలేజ్ అమ్మాయిలాగా కనిపించబోతున్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ తెలిపింది. ఒక విలేజ్ అమ్మాయి కాలేజీ చదువుతూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండే ఈ పాత్ర మీ అందరికీ నచ్చుతుంది అని ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది అంతేకాదు ఈ పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది అంటూ చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడికి నిరాశే మిగిల్చింది. మరి ఈ సినిమా ఎలా కలిసి వస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: