మే 20న తారక్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌... ఇదేనా ?

VUYYURU SUBHASH
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఐదు వ‌రుస హిట్ల‌తో మాంచి జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ ఓ రేంజ్‌లో ఉంటుంద‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ఎక్కువుగా పాన్ ఇండియా క‌థ‌లే ఎంచుకుంటాడ‌ని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ లిస్టులోదే కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ మూవీ. ఇక ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా అనౌన్స్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఆ సినిమా లేట్ అయ్యే ఛాన్సులు ఉండ‌డంతో ఎన్టీఆర్ స‌డెన్ గా కొర‌టాల శివ‌కు క‌మిట్ అయ్యాడు. ప్ర‌స్తుతం ఆచార్య చేస్తోన్న కొర‌టాల ఆ వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడు. వ‌చ్చే యేడాది ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ ఇప్ప‌టికే డేట్ కూడా ఇచ్చేశారు. ఎన్టీఆర్ - కొర‌టాల సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు.

ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంద‌న్న ఆశ ఫ్యాన్స్‌లో ఉంది. అయితే ఇది నిజం కాబోతున్న‌ట్టు టాక్ ?  ఎన్టీఆర్ 31 ప్రాజెక్టుపై ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మే 20న ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. ఇది కూడా భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంద‌ని... పాన్ ఇండియా క‌థ‌ను నీల్ ఇప్ప‌టికే రెడీ చేశాడ‌ని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. నీల్ ప్ర‌భాస్‌తో స‌లార్ మూవీకి క‌మిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ - నీల్ ప్రాజెక్టు లేట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: