గబ్బర్ సింగ్ ని మించి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా హరీష్ పవన్ సినిమాని తెరకెక్కిస్తాడట...
హరీశ్ శంకర్ ఇప్పటికే పవన్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు. ఆ క్రమంలో సినిమా పవన్ ఐబీ ఆఫీసర్ అని వార్తలు వచ్చాయి.ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడని మరో పుకారు మొదలైంది. ఇదే నిజమైతే పవన్ కెరీర్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 'తీన్మార్'లో పవన్ డబుల్ రోల్లో కనిపించాడు. అయితే ఆ సినిమాలో రెండు పాత్రలను ఒకేసారి చూసే అవకాశం ఉండదు. కానీ హరీశ్ శంకర్ సినిమాలో ఆ అవకాశం ఉందట.పవన్ కల్యాణ్ 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపిస్తాడట. ఒక పాత్ర పోలీసు అయితే, రెండో పాత్ర ఐబీ ఆఫీసర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కి ఎన్నడూ గుర్తిండిపోతుంది. గబ్బర్ సింగ్ ని మరిచిపోయేలా హరీష్ ఈ సినిమాని తెరాకెక్కిస్తున్నాడట..