పవర్ స్టార్ అంతకంటే ఎక్కువ : వకీల్ సాబ్ సక్సెస్ మీట్ లో దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ ....!!
మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమా అయినప్పటికీ వకీల్ సాబ్ కు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఆయన చరిష్మా, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక కొద్ది సేపటి క్రితం సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కి విచ్చేసి ఆడియన్స్ లో జోష్ నింపిన వకీల్ సాబ్ యూనిట్ తమ మూవీ సక్సెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం తాను టాలీవుడ్ కి డిస్ట్రిబ్యూటర్ గా వచ్చినప్పుడు తొలిప్రేమ మూవీ హక్కులు కొనుగోలు చేశానని ఆ సినిమాతో తమకు మంచి లాభం వచ్చిందని అక్కడి నుంచి పవర్ స్టార్ తమకు మంచి అనుబంధం ఏర్పడిందని అన్నారు.
అయితే అప్పటి నుండి పవన్ తో ఓ సినిమా నిర్మించాలనేది తన కల అని, అయితే ఇప్పటికి అది వకీల్ సాబ్ ద్వారా తీరడం అలానే మూవీ సూపర్ హిట్ కొట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు దిల్ రాజు. పవర్ స్టార్ కళ్యాణ్ ఒక హీరో కాదని అంతకుమించిన క్రేజ్ కలిగిన వ్యక్తని ఆ విధంగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆయనను ఓన్ చేసుకున్నారని ఆయనతో సినిమా చేయడం తన అదృష్టమని మాట్లాడుతూ పవన్ పై పొగడ్తలు కురిపించారు రాజు....!!