పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఎప్రిల్ 9న శుక్రవారం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. దాదాపు మూడేళ్ల తరవాత పవన్ కల్యాణ్ తెరపైన కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఉదయం నుండి పడిగాపులు కాచి సినిమా చూసిన ప్రేక్షకులకు వకీల్ సాబ్ విందు బోజనం వడ్డించాడు. బెనిఫిట్ షోతోనే సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతే కాకుండా టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సంబురాల్లో మునిగి తేలుతోంది. ఇక సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు..పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం వకీల్ సాబ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు దర్శకులు సినిమా సూపర్ గా ఉందని తెలిపారు. ఇక తాజాగా వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు సైతం సినిమా చూసానని చాలా బాగందని కామెంట్ చేసారు. రఘురామ తన ట్వీట్ లో తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ సినిమా చూసానని సినిమా అద్భుతంగా ఉందని...సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పండగే అని వ్యాఖ్యానించారు.
అంతే కాకుండా దీనిపై రాజకీయ కోణం లో కూడా రఘురామ ఓ కామెంట్ చేశారు. సినిమాలో పోలీసులు అబద్దపు కేసులు ఎలా పెడుతున్నారో చూపించారని..ఆ కేసుల పై పోరాటమే వకీల్ సాబ్ అని పేర్కొన్నారు. తాను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నఖీలీ కేసులు మరియు పోలీసుల వల్ల ఇబ్బందులు ఎదురుకుంటున్నానని రఘురామ తెలిపారు. అంతే కాకుండా తన లాయర్లు కూడా వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ లా వాదించి తప్పుడు కేసుల నుండి విడిపిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీలో ప్రభుత్వానికి వకీల్ సాబ్ కు మధ్య అంతర్యుద్దం నడుస్తుంటే రఘురామ సినిమా బాగుందని చెప్పడం..తనపై కూడా సినిమాలో రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు కేసులు బనాయిందనడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా రఘురామ వకీల్ సాబ్ కు మద్దతు తెలుపుతున్నట్టు అర్థమౌతోంది. ఇక సినిమా విషయానికొస్తే బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ ను తెరకెక్కించారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.