ఓ వైపు పవన్.. మరోవైపు ధనుష్.. మాములు రచ్చ కాదుగా..!!
దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి...సిల్వర్‌స్క్రీన్‌పై పవన్‌ని చూడాలని మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు 'వకీల్ సాబ్'తో సమాధానం దొరికింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై హిట్ టాక్ అందుకుంది. చాలారోజుల తర్వాత స్క్రీన్‌పై పవన్ బొమ్మ పడడంతో థియేటర్ల వద్ద యువత భారీగా సందడి చేస్తోంది. డ్యాన్స్‌లు, ఈలలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్క్రీన్‌పై పవన్ పేరు పడగానే కేకలు వేస్తూ.. కాగితాలు ఎగురవేస్తున్నారు..
మరి ఈ రచ్చ ఇలా ఉంటే మరోవైపు ధనుష్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'కర్ణన్'. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. చాలారోజుల తర్వాత ధనుష్ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు సినిమా హాళ్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి..ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పవన్ వకీల్ సాబ్, ధనుష్ కర్ణన్.. రెండు సినిమాలకు థియేటర్లలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే.మొత్తానికి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో..అక్కడ తమిళనాడు లో ధనుష్ కర్ణన్ సినిమాతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.!!