వకీల్‌సాబ్: పింక్‌ను మించిపోయిందిగా...!
ఈ సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఎన్నో రోజుల నుంచి నిరీక్షణ గా ఎదురు చూస్తున్న అభిమానులందరి ఆకలి తీర్చేలా ఉంది ఈ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ నటనకు సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఫిదా కావాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. పింక్ రీమేక్ గా తెరకెక్కినప్పటికీ అటు దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం ఈ సినిమా స్టోరీ లో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులూ చేశాడు.
సినిమా పరిశ్రమలో రీమేక్ సినిమాలు కామన్.. కానీ కొన్ని సినిమాలు మాత్రం అసలు సినిమా కంటే అద్భుతంగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చూసిన కూడా అదే అనిపిస్తుంది అని చెబుతున్నారు ప్రేక్షకులు. రీమేక్ గా తెరకెక్కినప్పటికీ ఏకంగా పింక్ సినిమాను మించిపోయింది అని చెబుతున్నారు. ఇక కొన్ని మార్పులు చేర్పులు చేసి దర్శకుడు వఖిల్ సాబ్ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని.. అభిమానులు పవన్ కళ్యాణ్ ను రీ ఎంట్రీ సినిమాలో ఎలా చూడాలి అనుకున్నారో దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాలో పవర్ స్టార్ ను అలా చూపించాడు అంటూ ప్రస్తుతం సినిమా చూసిన అందరూ చెబుతున్నారు.