షాకింగ్ 4 వేల థియేటర్స్ లో వకీల్ సాబ్ !
ఈమూవీ మార్కెటింగ్ విషయంలో దిల్ రాజ్ కు బోనీ కపూర్ తోడు కావడంతో ఈమూవీని విదేశాలలో సుమారు 700 దియేటర్లలో విడుదల చేస్తున్నట్లు టాక్. ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శింపబోతున్నారు. మల్టీ ప్లెక్సులు ఒకటీ అరా మినహాయిస్తే తెలుగు రాష్ట్రాలలోని అన్ని ధియేటర్లలోను ‘వకీల్ సాబ్’ హంగామా కనిపించ బోతోంది.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న లీకుల ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని 90 శాతం ధియేటర్లలో షోలన్నింటినీ ‘వకీల్ సాబ్’ తో నింపేస్తారని టాక్. ఈమూవీ ఫస్ట్ డే కలక్షన్స్ 25 కోట్లు వచ్చే విధంగా ఇప్పటికే పధకాలు రచించారని తెలుస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం ‘వకీల్ సాబ్’ను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. విదేశాల్లో సైతం ‘వకీల్ సాబ్’ దూకుడు మామూలుగా లేదని వార్తలు వస్తున్నాయి.
ఈమూవీని విదేశాలలో సుమారు 700 ధియేటర్లలో విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ ఓవర్సీస్ కలక్షన్స్ కూడ అదిరిపోతాయి అని అంటున్నారు. కరోనా బ్రేక్ తర్వాత ఒక భారతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రిలీజవడం ఇదే ప్రధమం దీనికితోడు ఈ మూనీ ఇప్రీమియర్ షోల కలక్షన్స్ కూడ కలుపుకుంటే ఈమూవీ బయ్యర్లకు మొదటి వారంలోనే తాము పెట్టిన పెట్టుబడిలో దాదాపు 50% శాతం పైగా రాబట్టాలని దిల్ రాజ్ చాల వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి. కేవలం ఏపీ తెలంగాణలలో కలిపి 2 వేలకు తక్కువ కాకుండా థియేటర్లలో ‘వకీల్ సాబ్’ రిలీజయ్యే అవకాశం ఉండటంతో ‘వకీల్ సాబ్’ కు వచ్చే కలక్షన్స్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి..