అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

Suma Kallamadi
మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 లో ప్రేమ పక్షుల్లా చెట్టాపట్టాలేసుకొని హౌస్ అంతా తిరిగారు. ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలించుకుంటూ నిజమైన ప్రేమికులవలె వాళ్ళిద్దరూ బిగ్‌బాస్ లో విపరీతంగా కెమిస్ట్రీ పండించారు. అయితే ఈ షో ముగిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ బయట కలుసుకుంటున్నారు. నిజానికి హౌస్ లో ప్రేమ పక్షుల్లా తిరిగిన కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ మోనాల్, అఖిల్ మాత్రం తమ బంధాన్ని హౌజులో మాత్రమే కాదు బయట కూడా బలపరచు కుంటున్నారు. బిగ్‌బాస్ సీజన్ ముగిసిన తర్వాత విన్నర్ తో సహా మిగతా కంటెస్టెంట్ల కంటే వీళ్ళిద్దరే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.


బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్ ఓ తెలుగు సినిమాలో కనిపించారు. అల్లుడు అదుర్స్ సినిమా లో రంభ ఊర్వశి స్పెషల్ సాంగ్ లో ఆమె స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించారు. గుజరాతిలో ఆమె ఒక సినిమా చేస్తున్నారు. తెలుగులో "తెలుగు అబ్బాయి.. గుజరాతి అమ్మాయి" అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. డాన్స్ ++ రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఆమె తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ అఖిల్ కూడా పాపులర్ అవుతున్నారు.


అయితే తాజాగా అఖిల్ మోనాల్ ని పబ్లిక్ ప్లేస్ లోనే కౌగలించుకున్నారు. ఇటీవల హైదరాబాదులో అడుగుపెట్టిన మోనాల్‌కు అఖిల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగిన మోనాల్ ని వెనకలా నుంచి అఖిల్ చేయి వేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. కానీ తన పై చేయి వేసిన వ్యక్తి అఖిల్ అని తెలియడంతో ఆమె ఆశ్చర్యపోయి ఏడుపు ప్రారంభించారు. అనంతరం అఖిల్‌ను ఎయిర్ పోర్ట్‌లోనే అందరి ముందే హగ్ చేసుకున్నారు. ఆపై  తనకు అఖిల్ రెండో గిఫ్ట్ ఇచ్చాడు అని చెబుతూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎయిర్ పోర్ట్ లో మోనాల్ ని సర్‌ప్రైజ్ కలిసిన దృశ్యాలను అఖిల్ సార్థక్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: