పూరి జగన్నాధ్ అంత రిస్క్ చేస్తున్నాడా...?
వాస్తవానికి ఈ సినిమా కరోనా కన్నా ముందే షూటింగును పూర్తి చేసుకుంది, కానీ అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడింది. అప్పటి నుండి సరి అయినా సమయం కొస్తుండం వేచి చూస్తున్నారు. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం వచ్చే జూన్ లో విడుదల చేస్తారని మెదట్లో ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఇది కూడా సందేహమే అని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటని చూస్తే ఈ సినిమాను ఓ టి టి లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకు మంచి ఆఫర్ నే ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చిత్ర బృందం నుండి అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం లేదు.
ఈ సినిమా విజయం ఆకాష్ కెరీర్ కు చాలా ముఖ్యమనే చెప్పాలి. కాగా ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ పూరి సరసన ముంబై భామ కేతిక శర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో జరిగే ఒక ప్రేమకథగా తెలుస్తోంది. ఏ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తోంది. ఆకాష్ హీరోగా ఓ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దీని తరువాత ఆకాష్ తన చిత్రాన్ని జార్జ్ రెడ్డి కి దర్శకత్వం వహించి మంచి గుర్తింపును తెచ్చుకున్న జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు ఆకాష్. పైగా ఇప్పటి వరకు ఆకాష్ కు సరైన బ్రేక్ రాలేదు. మరి ముందు అయినా ఆకాష్ మంచి హీరోగా సెటిల్ అవుతాడా చూడాలి. అయితే ఇది విన్న టాలీవుడ్ లో కొంతమంది ప్రస్తుతం ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయడమే మంచిదని అభిప్రాయపడుతున్నారా. పూరి జగన్నాధ్ ఈ సినిమా విషయంలో రిస్క్ చేస్తున్నారా...?