'శివాజీ' సినిమాలో నటించిన ఈ ఇద్దరు నిజ జీవితంలో ఎలా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్య పోతారు..!!

Anilkumar
సూపర్ స్టార్ రజినీకాంత్ తన నటనతో విశ్వరూపం చూపించిన చాలా సినిమాల్లో 'శివాజీ' సినిమా కూడా ఒకటి..సినిమాలో రజిని స్టయిల్, ఆయన నటన అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అయితే ఈ సినిమా విషయానికొస్తే.. సినిమాలో రజినీకాంత్ శ్రియ ని ఇష్టపడతారు. ఈ విషయం శ్రియ కి చెప్తారు. కానీ శ్రియ ఒప్పుకోరు. అప్పుడు రజనీకాంత్ తన కుటుంబం మొత్తం తో కలిసి శ్రియ వాళ్ల ఇంటికి వెళ్తారు. అప్పుడు శ్రియ వాళ్ళ ఇంటి దగ్గర నివసించే ఒక వ్యక్తి తనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వాళ్ళని పెళ్లి చేసుకోమని రజనీకాంత్ తో వచ్చి చెప్తారు.ఈ సీన్ కొంతమందికి కామెడీగా అనిపించింది, ఇంకొంతమందికి ఇన్ సెన్సిటివ్ గా అనిపించింది.
 
అలా ఈ సీన్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టారా? ఈ పాటికే మీలో చాలా మందికి వాళ్ళెవరో అర్థమైపోయి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది శివాజీ సినిమా లోని ఇందాక చెప్పిన సీన్ లో నటించిన ఇద్దరు యాక్టర్స్. సినిమా కోసం వాళ్ల గెటప్ మార్చారట.తెలుగు లో వీళ్ళ క్యారెక్టర్స్ పేర్లు అక్కమ్మ - జెక్కమ్మ. వీళ్లిద్దరు సినిమా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తారు. స్క్రీన్ టైం అంత ఎక్కువ సేపు ఉండదు. కనిపించింది 3,4 సీన్స్ లోనే అయినా కూడా చాలా పాపులర్ అయ్యారు. కానీ వీళ్ళ అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు. కేవలం పిక్చర్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపించాయి.

ఈ ఒక్క సినిమానే కాకుండా, వేరే ఏదైనా సినిమాలో నటించారా? లేదా? అన్న విషయం కూడా ఎవరికీ ఐడియా లేదు.శివాజీ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. విడుదల అయిన సమయంలో ఎంతో మంది ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ గారి పర్ఫార్మెన్స్ తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం, వివేక్ కామెడీ టైమింగ్, ఫైట్స్, పంచ్ డైలాగ్స్, సెట్టింగ్స్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి. వీటన్నిటితో పాటు సుమన్ విలన్ గా చేయడం ఇంకొక హైలెట్.శివాజీ సినిమా 2007 లో జాతీయ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ అందుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: