టాలీవుడ్ గాసిప్స్ :దృశ్యం 2 సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సూజ వరుణీ..!

Divya

ఈ నటి సూజ వరుణీ ఎవరు ..? ఎందులో నటించింది.. అసలు దృశ్యం 2 సినిమా కు, ఈమెకు సంబంధం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..! ఆగండి.. అక్కడికే వస్తున్నా..నటి సూజ వరుణీ... ఎవరో కాదు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తో టాక్ ఆఫ్ ది టౌన్  అయ్యింది.. ఈమె బిగ్ బాస్ షో తో పాటు శశికుమార్ కిడారి, ఇరవుక్కు ఆయీరమ్ కంగల్, అరుణ్ విజయ్ కుత్రమ్ 23 లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో ఈమె నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే ఈ మన తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేదు. అయితే ఇప్పుడు దృశ్యం 2 సినిమాలో ఒక అద్భుతమైన కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మలయాళం బ్లాక్ బస్టర్ చిత్రం దృశ్యం సినిమాను విక్టరీ వెంకటేష్ హీరోగా, మీనా హీరోయిన్ గా  తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది సూజ వరుణీ. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నటి  సూజ వరుణీ మాట్లాడుతూ.. నేను దృశ్యం మొదటి భాగాన్ని అన్ని భాషల లో చూశాను. అలాగే రెండవ భాగం మలయాళం లో చూసి, దర్శకుడైన జీతు జోసెఫ్ ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ను ఎలా తయారు చేశాడు అని ఆశ్చర్యపోయాను. అంతేకాకుండా ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టులో నేను ఒక భాగం ఎందుకు కాలేకపోయాను అని కూడా బాధపడ్డాను. కానీ దృశ్యం రీమేక్ లో ఒక పాత్ర కోసం నన్ను ఎంచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది..
అది కూడా ప్రఖ్యాత సురేష్ ప్రొడక్షన్ సంస్థ నన్ను సంప్రదించినప్పుడు, ఇక నా కల నెరవేరిందని అనుకున్నాను. ముఖ్యంగా వెంకటేష్ సార్, మీనా మామ్ నదియా మామ్ అలాగే తెలుగు పరిశ్రమలోని అనేకమంది సీనియర్ ఆర్టిస్ట్ లతో కలసి స్క్రీన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను వారి నుండి చాలా నేర్చుకున్నాను. అలాగే జీతు జోసెఫ్  తో కలిసి పనిచేయడం నా జీవితంలో ఒక  ఘటన గా మిగిలిపోతుంది . ఈ అవకాశం దేవుడు ఇచ్చిన వరం గా నేను భావిస్తున్నాను.  జీతు జోసెఫ్  చాలా కూల్ గా ఉంటూ,నటీనటుల నుంచి మంచి ప్రదర్శన రాబట్టుకుంటాడు. ఈ సినిమా నాకు ప్రతిరోజూ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇక సరైన సమయంలోనే ఈ సినిమా అవకాశం వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: