రామ్ చరణ్ చేసిన సహాయానికి గెటప్ శ్రీను గుడి కట్టినా తక్కువే : కమెడియన్ సత్య

Anilkumar
టాలీవుడ్ లో ఈతరం కమెడియన్ గా సత్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..మంచి కామెడి టైమింగ్ తో ఆడియన్స్ ని అలరిస్తున్న సత్య.. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడు.. ఇక ఇదిలా ఉంటె మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో పొడుగుతున్నాడు ఈ కమెడియన్..ముఖ్యంగా ఇతరులకు సేవా చేయాలంటే అది చరణ్ తర్వాతే ఎవరైనా అని అంటున్నాడు.. అంతేకాదు చిరులోని మంచితనాన్ని, బాబాయి పవన్ లోని సేవాగుణాన్ని అలవర్చుకున్నాడని చెబుతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించాడు సత్య.

ఇటీవల శర్వానంద్ 'శ్రీకారం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు హెల్పింగ్ నేచర్ ను ఆకాశానికి ఎత్తేశాడు శర్వానంద్‌. మెగాస్టార్ లోని ఆ తత్వం చెర్రీకి మాత్రమే వచ్చిందని అన్నాడు. అసలు, చిరును ఆ వేడుకకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది కూడా రామ్ చరణే అని సమాచారం. ఈ వేడుకలో తన ఫ్రెండ్ గురించి చాలా చెప్పాడు శర్వా. అతని రుణం తీర్చుకోలేనిదని అన్నాడు.ఇప్పుడు సత్యమాట్లాడుతూ.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు కూడా డబ్బు సాయం చేశాడని వెల్లడించాడు. తనకే కాదు ఇంకా ఎంతో మంది సహాయం చేశాడని, కానీ.. చెర్రీ ఎవ్వరికీ చెప్పుకోడు అని తెలిపాడు. ఇక, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుకు రామ్ చరణ్ చేసిన సహాయానికి.. శ్రీను ఏకంగా గుడి కట్టిస్తాడని చెప్పాడు.

ఇంకా.. రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా వెల్లడించాడు సత్య. సినిమా సెట్లో చెర్రీ చాలా సాధారణంగా ఉంటాడని తెలిపాడు. రంగస్థలం సినిమా సమయంలో సాదాసీగా ఉంటూ మా అందరితో కలిసి ఎన్నోసార్లు సాధారణ భోజనం చేశాడని చెప్పాడు. ఎక్కడా స్టార్ హోదా చూపించుకోని మంచి మనసున్న వ్యక్తి రామ్ చరణ్ అంటూ.. చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు సత్య.. దీంతో చరణ్ పై సత్య చేసిన ఈ కామెంట్స్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్..ఇదిలా ఉంటె ఇటీవల విడుదలైన గాలి సంపత్ సినిమాలో మంచి నటనను కనబర్చాడు ఈ కమెడియన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: