టాలీవుడ్ గాసిప్స్ : విడుదలకు నోచుకోని రామ్ చరణ్ మూవీస్..?

Divya

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. నెంబర్ వన్ హీరో గా రేసులో దూసుకుపోతున్నాడు  రామ్ చరణ్. ఇతని గురించి బాక్సాఫీస్ వద్ద  చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక యావరేజ్ మూవీని కమర్షియల్ హిట్ చేయగల సత్తా ఉన్న హీరోలలో రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటాడు. ఇక సరైన హిట్ తగ్గితే ఇండస్ట్రీలో ఒక రికార్డును కూడా మిగలకుండా కొట్టేస్తాడు  . దానికి ఉదాహరణ రంగస్థలం సినిమా.


అంతేకాకుండా  నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ వదలకుండా  బ్రేక్ చేసి రామ్ చరణ్  తన స్టామినా ను బాక్సాఫీస్ వద్ద  మరోసారి చూపించాడు . ఇక ఆ సినిమా తర్వాత వినయ విధేత రామ  అట్టర్ ఫ్లాప్ అయినా కూడా  మంచి వసూళ్లను రాబట్టి మరో రికార్డును సృష్టించింది . ఇదిలా ఉండగా రామ్ చరణ్ కెరీర్ లో షూటింగ్ ని ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలో ఏవో ఒక సారి ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

రామ్ చరణ్  మగధీర సినిమా తర్వాత ఆరెంజ్  సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో  పెద్ద ప్లాప్ అయింది. కానీ మ్యూజికల్ పరంగా హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాతో పాటు ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి అప్పట్లో ఘనంగా ప్రారంభించాడు.ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ తీసుకున్నారు. కానీ అప్పటికే ఆరెంజ్ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో,'మెరుపు'సినిమాలో కూడా కాస్త అలాగే కొత్తరకం కాన్సెప్ట్ కాబట్టే జనాలకు మళ్లీ రీచ్ అవ్వదేమో అని అనుకుని నిలిపేశారు.

ఈ సినిమా బదులుగా అయాన్ రచ్చ సినిమా చేశాడు, అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈ సినిమా అప్పట్లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత నుంచి ఎక్కువగా రామ్ చరణ్ మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చి, తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ను సంపాదించాడు.  అంతే కాకుండా రామ్ చరణ్ హిందీలో జంజీర్ అనే సినిమాను కూడా చేశాడు. కానీ ఆ చిత్రం అప్పట్లో ఘోర పరాజయం పాలైన రాంచరణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయలేదు.


రామ్ చరణ్ కి వున్న  ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతలు క్యూ కట్టేవారు, అలా రామ్ చరణ్ మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక మంచి మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ప్రారంభం అయితే అయ్యింది కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరుపుకో లేకపోయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే హిందీలో పీకే, త్రీ ఇడియట్స్  వంటి సెన్సేషనల్ హిట్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హీరో గా త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: