ప్రభాస్ కు షాక్ ఇచ్చిన కృష్ణంరాజు !

Seetha Sailaja


ఏడు పదుల వయస్సు దాటినా కృష్ణంరాజులో పౌరుషం తగ్గలేదు అని చెపుతూ ప్రభాస్ కు షాక్ ఇస్తూ ఈరోజు గుణశేఖర్ విడుదల చేసిన రుద్రమదేవిలోని కృష్ణంరాజు లుక్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమాలో గణపతిదేవ చక్రవర్తి పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నాడు. రాణి రుద్రమదేవి తండ్రిగా మాత్రమే కాకుండా కాకతీయ సామ్రాజ్య చరిత్రలో గణపతిదేవ చక్రవర్తికి ఒక విశిష్ట స్థానం ఉంది. 

రుద్రమదేవిని మహారాణిగా తీర్చి దిద్దడంలో గణపతిదేవ చాల కీలక పాత్ర పోషించినట్లు చరిత్ర కారులు చెపుతారు. అతడు చనిపోయిన తరువాత మహారాణిగా కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని రుద్రమ అధిస్టించిన నేపధ్యంలో ఆనాటి తన సామంత రాజుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కున్నా తన తండ్రి గణపతిదేవ వద్ద నేర్చుకున్న తంత్రంతో కాకతీయ సామ్రాజ్యం విచ్చిన్నం కాకుండా రక్షిస్తుంది రుద్రమదేవి.

అటువంటి ధీరోదాత్తమైన మహారాజు పాత్రలో కృష్ణంరాజు దర్పంగా నిలబడి ఉండటం చూస్తూ ఉంటే అమరేంద్ర బాహుబలి కి తాను ఏ విధంగాను తీసిపోను అన్న భావన కృష్ణంరాజు చూపులో కనిపిస్తోంది. ‘బాహుబలి’ విజయంతో గుణశేఖర్ చాల పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే వరస పెట్టి ఇలా ‘రుద్రమదేవి’ సినిమాలోని పాత్రలను వేగంగా అందరికీ వరస పెట్టి పరచయం చేస్తున్నాడు. 

ఈ ప్రయత్నాలు వల్ల ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడితే గుణశేఖర్ సమస్యలు కొంతవరకు తీరిపోతాయేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: