సత్యమూర్తి థాంక్స్ మీట్ లో బన్నీ షాకింగ్ కామెంట్స్ !

Seetha Sailaja

నిన్న సాయంత్రం విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రం ప్రాంగణంలో కురుస్తున్న వర్షం సాక్షిగా జరిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ థాంక్స్ గివింగ్ మీట్ లో అల్లు అర్జున్ మీడియాను టార్గెట్ చేస్తూ వేసిన  సెటైర్లు అల్లుఅర్జున్ మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన కెరియర్ లో తాను నటించిన ఏ సినిమాకు ఇంత బ్యాడ్ రివ్యూస్ రాలేదు అని అంటూ దానివల్ల సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ఆవ్యతిరేక పరిస్థితులను ఎదిరిస్తూ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ క్రియేట్ చేసిన రికార్డులు తన అభిమానులకు అంకితం చేస్తున్నానని బన్నీ రెచ్చి పోయిన ఉత్సాహంతో వైజాగ్ లో హంగామా చేసాడు.


 కొంతమంది సినిమాలను బుర్రకు పదును పెట్టే పజిల్ గా భావిస్తూ చూస్తారని కానీ  ‘సన్నాఫ్ సత్యమూర్తి’  సినిమాను  గుండెకు హత్తుకునే సినిమాగా చూడాలని అలా చూడని వారికి  సత్యమూర్తి సినిమా అర్ధం కాదని తన స్పీచ్ ని ఒక పజిల్ గా మార్చి మాట్లాడాడు అల్లుఅర్జున్. అయితే ఎప్పుడూ జరిగే విధంగానే బన్నీ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రస్తావనను తమ అరుపులు కేకలు రూపంలో తీసుకు  రావడంతో పవన్ గురించి మాట్లాడకుండా కుదరదు కదా అని అంటూ  తనకన్నా త్రివిక్రమ్ ఈ విషయమై బాగా మాట్లాడుతాడు అని తెలివిగా తప్పించుకున్నాడు బన్నీ.


అయితే బన్నీ తరువాత మాట్లాడిన త్రివిక్రమ్ తనకు ఆంధ్రాయునివర్సిటీ, వైజాగ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకుని క్లుప్తంగా మాట్లాడాడు తప్ప ఈసారి పవన్ ప్రస్తావన తన ఉపన్యాసంలో తీసుకు రాకపోవడం మరో ట్విస్ట్. ఈ సినిమా పై బయ్యర్లు 55 కోట్లు పెట్టుబడి పెట్టారు అని  వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు నష్టం లేకుండా బయటకు రావాలి అంటే మరొక రెండు వారాలు ఈ సినిమా ఇరు రాష్ట్రాలలోని బి, సి సెంటర్లలో కూడా బాగా ఆడితే కాని బయ్యర్లు గట్టేక్కలేరు అనే మాటలు వినిపిస్తున్నాయి.


‘దోచేయ్’ టాక్ బట్టీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 


ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం నడుస్తున్న ఈ మూడవ వారం ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి కీలకంగా మారింది. ఈరోజు విడుదల అవుతున్న ‘దోచేయ్’ టాక్ బట్టీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ బయ్యర్ల అదృష్టం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.  ఏది  ఎలా ఉన్నా ఏకంగా బన్నీ మీడియాను టార్గెట్ చేయడం ఆశ్చర్యకరం..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: