తెలుగు తెర జేజెమ్మ అనుష్క బన్నీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ ఆశలను నెరవేర్చడంలో బన్నీ పూర్తిగా విఫలమయ్యాడని అంటున్నారు. దర్శకుడు గుణశేఖర్ అల్లుఅర్జున్ ద్వారా ‘రుద్రమదేవి’ పై చేసిన ప్రయోగం కూడ అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని వార్తలు వినపడుతున్నాయి. గత మార్చి నెలలో ‘రుద్రమదేవి’ ఏప్రిల్ మూడవ వారంలో విడుదల అవుతుంది అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా ఈసినిమా ఆడియో ఫంక్షన్లు వైజాగ్ మరియు వరంగల్ పట్టణాలలో జరగడంతో ఏప్రిల్ లో ఈసినిమా విడుదల ఖాయం అని అనుకున్నారు అంతా.
కానీ ఇప్పుడు ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో గుణశేఖర్ కే తెలియని పరిస్థితి ఏర్పడిందని అని అంటున్నారు. ప్రస్తుతం ఈసినిమా రీ రికార్డింగ్ లండన్ లో జరుగుతోంది అన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఇంకా ఈ సినిమా రీరికార్డింగ్ పనులు ప్రరంభమే కాలేదు అని అంటున్నారు.
ఈ విషయాలు ఇలా ఉండగా ఈసినిమా బిజినెస్ వ్యవహారాలు కూడ అంతంత మాత్రంగా వున్నాయని టాక్. దర్శకుడు గుణశేఖర్ బన్నీని ఫోకస్ చేస్తూ ట్రయిలర్లు, టీజర్లు ఇచ్చినా, హిస్టారికల్ మూవీ భయంతో చాలామంది బయ్యర్లు ఈసినిమా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, కాని ఈసినిమా రైట్స్ కొనే విషయంలో అంతగా ఆశక్తి కనబరచటం లేదని టాక్. మరి ఈ పరిస్థితులలో ‘రుద్రమదేవి’ ఈ నెలలో కాకున్నా కనీసం వచ్చే మే నెలలో అయినా విడుదల అయి సమ్మర్ రేస్ కు నిలబడుతుందా అనే కామెంట్స్ విన పడుతున్నాయి..