వెండి తెర కథలు : మా భూమి కి 35 ఏళ్ళు !

Seetha Sailaja

తెలంగాణ సాయుధ రైతాంగపోరాట నేపధ్యంలో నిర్మించిన ‘మా భూమి’ సినిమాకు విడుదల అయి 35 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 1946-51 మధ్య జరిగిన రైతాంగ పోరాట నేపధ్యంలో వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తీసారు. 1980 ప్రాంతంలో నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించారు అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం.

 ప్రముఖ నిర్మాత, దర్శకుడు బి. నరసింగ రావు నిర్మించారు. అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింప బడ్డ ఈ సినిమాకు అనేక అవార్డులు వచ్చాయి. కైరో, సిడ్ని అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో అనేక ప్రశంసలు పొందిన ఈ సినిమా CNN-IBN  సంస్థ చేసిన  ఎంపికలో ఇప్పటి వరకు మనదేశంలో నిర్మించిన టాప్ 100 సినిమాలలో ‘మా భూమి’ కి స్థానం దక్కడం విశేషం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: