బాహుబలి ని చిన్నచూపు చూసిన జాతిరత్నాలు !

Seetha Sailaja

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి తెలుగు సినిమాకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ ఒక చరిత్ర. ఆమూవీ గురించి సెటైర్లు వేయాలి అంటే ఎవరికైనా ధైర్యం ఉండాలి. అయితే ఆ సినిమాలో భల్లాల దేవా గా నటించి తన ఇమేజ్ ని మరింత పెంచుకున్న రానా ముందు ‘జాతి రత్నాలు’ టీమ్ జోక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన ఒక టివి షోలో జరిగింది.


రానా విభిన్నమైన సినిమాలలో నటిస్తూనే బుల్లితెర షోలను కూడ హోస్ట్ చేస్తున్నాడు. గతంలో బుల్లితెర పై సక్సస్ అయిన ‘నెం. 1 యారి’ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన సీజన్ 3ని రానా ప్రారంభించబోతున్నాడు. ఈ సీజన్ కు సంబంధించిన మొదటి షో ‘జాతిరత్నాలు’ హీరోలతో జరగబోతోంది.



ఈరోజు రాత్రి నుంచి ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేయబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ‘జాతి రత్నాలు’ హీరోలు నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి రాహుల్ రామక్రిష్ణ నాగ్ అశ్విన్‌ లతో షూట్ చేసిన తొలి ఎపిసోడ్‌ కు సంబంధించి ప్రోమో తో ఈకార్యక్రమానికి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రోమోలో ఈ హీరోలు ఏకంగా ‘బాహుబలి’ మూవీని టార్గెట్ చేయడం ఆశ్చర్యంగా మారింది.


ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న రానాని ‘బాహుబలి’ సినిమా తెలుసా మీకు అని నవీన్ అడగ్గా.. హా తెలుసండీ చూశాను అని రానా చెప్పగా.. ‘మా జాతి రత్నాలు ముందు బాహుబలి నత్తింగ్ సార్’ అంటూ రాహుల్ రామక్రిష్ణ పంచ్ వేశాడు. దీనిపై రియాక్ట్ అయిన రానా.. ‘సూపర్బ్ జోక్ నాన్నా’ అంటూ గాలి తీసేశాడు. ఇప్పుడు ఈ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులలో చాల సులువుగా కనెక్ట్ అయిపోయింది. అయితే సామాన్యంగా టివి షోలలో జోక్ లు సెటైర్లు వేసుకోవడం సర్వసాధారణమైన విషయమే అయినా ఏకంగా ‘బాహుబలి’ పై జోక్స్ పేల్చే స్థాయికి ‘జాతి రత్నాలు’ టీమ్ వెళ్ళిపోవడం ఆశ్చర్యం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: