బాలీవుడ్ ఎంట్రీ టైమ్‌లోనే సాయి పల్లవికి ఇలాంటి ఇబ్బందా..?

Amruth kumar
సౌత్ ఇండియా 'లేడీ పవర్ స్టార్' సాయి పల్లవిబాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చిన్న నిరాశ కలిగించే వార్త. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన ఆమె నటిస్తున్న ప్రేమకథా చిత్రం 'మేరే రహో' విడుదల తేదీలో మార్పులు జరిగాయి.తొలుత ఈ చిత్రాన్ని 2025 ద్వితీయార్థంలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2026 ప్రథమార్ధంలో థియేటర్లలోకి రానుంది.సినిమా అవుట్‌పుట్ విషయంలో నిర్మాతలు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్‌లోని మంచు కొండల్లో చిత్రీకరించిన విజువల్స్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు వీఎఫ్ఎక్స్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. .


 అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను హడావిడిగా కాకుండా, సరైన సమయంలో సోలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే 2026 వేసవి లేదా ఆ పక్కన ఉండే తేదీలను పరిశీలిస్తున్నారు.ఈ సినిమా సాయి పల్లవికి బాలీవుడ్‌లో మొదటి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.ఇది థాయ్‌లాండ్‌కు చెందిన 'వన్ డే' అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి రీమేక్ అని టాక్. ఒక రోజు మాత్రమే గుర్తుండే జ్ఞాపకం చుట్టూ తిరిగే ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది.సినిమా షూటింగ్ మెజారిటీ భాగం జపాన్‌లో జరిగింది. సాయి పల్లవి సహజ సిద్ధమైన నటన, జునైద్ ఖాన్ ఇంటెన్సిటీ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి.సునీల్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ..


సాయి పల్లవి తన పాత్రల ఎంపికలో ఎంత కచ్చితంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుకే ఆమె చేస్తున్న బాలీవుడ్ ఎంట్రీ సాధారణంగా ఉండదని, ఒక క్లాసిక్ లవ్ స్టోరీతో ఆమె ఉత్తరాది ప్రేక్షకులను కూడా మాయ చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా ఆలస్యమైనా, మంచి క్వాలిటీతో వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: