ఒకప్పుడు థియేటర్ బయట.. నేడు అదే థియేటర్‌పై తన కటౌట్స్!

Amruth kumar
టాలీవుడ్‌లో ప్రస్తుతం 'ది రాజా సాబ్' వంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు మారుతి. నేడు రూ. 400 కోట్ల బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేస్తున్న ఆయన వెనుక ఎవరికీ తెలియని ఒక గొప్ప కష్టమైన ప్రయాణం ఉంది. తాజాగా ఆయన తన గతాన్ని నెమరువేసుకుంటూ చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.మారుతి సొంతూరు మచిలీపట్నం అయినప్పటికీ, ఆయన జీవితం వైజాగ్ (విశాఖపట్నం) తో ముడిపడి ఉంది.రాధికా థియేటర్ ఎదురుగా: వైజాగ్ లోని ప్రసిద్ధ రాధికా థియేటర్ ఎదురుగా ఒకప్పుడు మారుతి తండ్రికి ఒక అరటిపండ్ల బండి ఉండేది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మారుతి తన తండ్రికి సహాయంగా అక్కడ అరటిపండ్లు అమ్మేవారు. కేవలం అరటిపండ్లు అమ్మడమే కాకుండా, ఆయన హైదరాబాద్ వచ్చిన కొత్తలో వాహనాలఅకు నెంబర్ ప్లేట్లు రాయడం, స్టిక్కర్లు వేయడం వంటి చిన్న చిన్న పనులు చేసేవారు.



అరటిపండ్లు అమ్ముతున్న సమయంలోనే పక్కనే ఉన్న థియేటర్లో సినిమాలు చూస్తూ, సినిమా పోస్టర్లను గమనిస్తూ ఉండేవారు. ఆ ఆసక్తితోనే ఆయన యానిమేషన్ నేర్చుకుని మెల్లగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.మారుతి ఎదుగుదల ఏ ఒక్క రోజులోనో జరిగింది కాదు. ఆయన ప్రతి అడుగులోనూ ఎంతో కృషి ఉంది.



ఆర్య (Arya): అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమాకు మారుతి డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. తన పెళ్లికి కట్నంగా వచ్చిన డబ్బుతో ఆ సినిమా హక్కులు కొని లాభాలు సాధించారు.ఈ రోజుల్లో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా మారి రూ. 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు.ఒకప్పుడు అరటిపండ్లు అమ్మిన అదే థియేటర్ల వద్ద నేడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' కటౌట్లు కనిపిస్తున్నాయి. ఇది ఆయన విజయానికి నిదర్శనం."కష్టపడే తత్వం ఉంటే ఎక్కడి నుండైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు" అని మారుతి నిరూపించారు. బూతు దర్శకుడు  అనే ముద్ర వేసిన చోటే నేడు 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' దర్శకుడిగా, ఇప్పుడు 'పాన్ ఇండియా' దర్శకుడిగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.


https://www.instagram.com/p/DSzOK1_kx9H/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: