"ఇది సమయం కాదు.. సంధర్భం అంతకంటే కాదు"..తన పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్..??

Anilkumar
వెండితెర వేదికగా అభిమానుల్ని అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొన్నేళ్ల విరామం తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో బుల్లితెరపై బిగ్ బాస్ అనే షో టతో హోస్ట్ గా మారిన ఎన్టీఆర్.. తన ఆ షో లో తన హోస్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారంకానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఆ వేడుకలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తారక్‌..

ఈ నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన గురించి ప్రశ్నలు అడిగారు ప్రెస్ వాళ్ళు..ఇందులో భాగంగానే తన పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ స్పదించారు. దీనికి ఆన్సర్ మీరే చెప్పాలని అన్నారు. జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కాబోతున్న సరికొత్త షో 'ఎవరు మీలో కోటీశ్వరుడు'కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని సదరు చానల్ నిర్వహించింది. అందులో భాగంగా రిపోర్టర్లతో ఎన్టీఆర్ ముచ్చటించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానమచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ రిపోర్టర్.. పొలిటికట్ ఎంట్రీ ఎప్పుడుంటుందంటూ ప్రశ్నించగా.. దానికి ఎన్టీఆర్ తన స్టైల్లో సమాధానం చెప్పారు.

దీనికి సమాధానం మీరే చెప్పాలని, చాలా కార్యక్రమాల్లో దీనికి తాను సమాధానం చెప్పానని అన్నారు. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించేందుకు ఇది సమయం కాదు, సందర్భం అంతకంటే కాదని అన్నారు.తర్వాత తీరిగ్గా, మంచిగా వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని ఎన్టీఆర్ అన్నారు...దీంతో ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి.. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం క్లైమాక్స్ ఎపిసోడ్ ను షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 13 న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: