హీరో నిఖిల్ కు గాయాలు.. కార్తికేయ 2 షూటింగ్‌లో ప్రమాదం...?

VAMSI
ప్రస్తుతం కరోనా ముందు వరకు ఆగిపోయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో పడ్డారు.అయితే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే సందర్భంలో హీరో నిఖిల్ కు గాయాలయినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగానే యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 షూటింగులో బిజీ గా ఉన్నాడు. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కావడంతో అందుకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని అంతకు మించి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. కార్తికేయ మూవీని తెరకెక్కించిన చందూ మొండేటి ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లో జరుగుతోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో నిఖిల్ గాయపడినట్లు సమాచారం. దాంతో షూటింగ్ ను నిలిపివేసిందట చిత్ర బృందం. అయితే ప్రస్తుతం నిఖిల్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని... ఆయన అభిమానులు ఎవరూ ఆందోళన చెందకండి అంటూ... చెప్పుకొచ్చిందట చిత్ర బృందం. దాంతో ఆయన ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు చిత్రానికి పరిచయమయ్యాడు హీరో నిఖిల్ తన స్లాంగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ సినిమాతో తెరంగ్రేటం చేసినా మిగిలిన హీరోలు కొద్ది కాలానికే కెమెరాకు ప్యాకప్ చెప్పగా... హీరో నిఖిల్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నాడు ఈ డిఫరెంట్ డైనమిక్ హీరో. వైవిధ్య భరిత కథలను ఎంచుకోవడంలో హీరో నిఖిల్ కు పెట్టింది పేరు. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ అభిమానుల సంఖ్య అంతకంతకూ పెంచుతూ పోతున్న నిఖిల్ ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. కాగా ఇటీవలే నిఖిల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే కోలుకుని మళ్ళీ కార్తికేయ సినిమా షూటింగులో పాల్గొనాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: