మన తెలుగు సినిమాలలో అదిరిపోయే ట్విస్ట్ వున్న సినిమాలు ఏంటో తెలుసా..!
రంగస్థలం :
మొదటి నుండి ఫణీంద్ర భూపతి విలన్ ని గా చూపిస్తూ, దక్షిణామూర్తిని మంచివాడిగా చూపిస్తాడు దర్శకుడు. అయితే చివరిలో హీరో అన్నయ్య కుమార్ బాబు ని చంపేసి, దక్షిణామూర్తి విలన్ అని రివిల్ చేస్తారు. ఈ ట్విస్ట్ అదిరిపోయేలా ఉంది ఈ సినిమాలో.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..
బాహుబలి :
నమ్మకస్తుడైన కట్టప్ప చివరికి బాహుబలి నే చంపుతాడు అని ట్విస్ట్ చూసేవారి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇక ఫస్ట్ పార్ట్ మొత్తం కట్టప్ప బాహుబలి ని చంపడం ఏంటి..? అనే పాయింట్ తోనే ముగుస్తుంది. ఇక ఆ తర్వాత ఎందుకు కట్టప్ప బాహుబలి ని చంపాడు అనే ప్రశ్నతో ప్రేక్షకులు అదే క్యూరియాసిటీ తో రెండేళ్లు ఎదురుచూశారు. ఇక పార్ట్ 2 సినిమా చూసి సాటిస్ఫై అయ్యారు. ఇంత గొప్ప ట్విస్ట్ ఇవ్వగల కెపాసిటీ కేవలం రాజమౌళి కి మాత్రమే ఉందేమో..
ఆర్ ఎక్స్ 100 :
మొట్టమొదటిసారి ఒక హీరోయిన్ ను విలన్ గా చూపించి, ప్రేక్షకులను అలరించాడు దర్శకుడు. నాకు తెలిసి ఈ ట్విస్ట్ ను ఎవరూ ఊహించి ఉండరు.
C/o కంచరపాలెం :
వెంకటేష్ మహా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలు ఒకేసారి నాలుగు స్టోరీలు నడుస్తాయి. దేనికదే డిఫరెంట్ నేపథ్యంలో సాగుతుంటాయి. ఫైనల్ గా ఇవన్నీ ఒకే వ్యక్తి స్టోరీ అని క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు దర్శకుడు. అంతలా ఈ సినిమాలు ట్విస్ట్ అదిరిపోయింది..
పోకిరి:
ట్విస్ట్ లలో అదిరిపోయే ట్విస్ట్ అంటే ఇదేనేమో.. ఫస్ట్ హాఫ్ వరకు మహేష్ ను పోకిరిగా, పండుగాడి గా చూపిస్తూ, ఆ తరువాత నాజర్ చేత నా కొడుకు కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రెడిట్ కేవలం పూరి జగన్నాథ్ కు మాత్రమే దక్కింది..