ఆ దర్శకుడితో బన్నీ మూవీ ఖరారైంది.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

praveen
కే జి ఎఫ్ సినిమా  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే . ప్రతి భాషలో కూడా కే జి ఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు  ప్రశాంత్ నీల్  పై  కూడా ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.  అయితే ప్రస్తుతంప్రశాంత్ నీల్  ఓ వైపు కే జి ఎఫ్ చాప్టర్ 2  తెరకెక్కిస్తు ఉండగా అదే సమయంలో ఇక ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా  ఎంతగానో క్రేజ్ సంపాదించిన స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

 కేవలం ప్రభాస్ సినిమా మాత్రమే కాదు వరుసగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ స్టార్ హీరోలందరితో కూడా సినిమాలు తీసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు  అన్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్  సలార్  సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న  విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ తో కూడా ప్రశాంత్ నీల్  సినిమా ఉండబోతుంది అన్నది అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో సినిమా  చేసేందుకు  అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతం ప్రశాంత్ నీల్  ప్రభాస్ తో  సలార్ సినిమాతో  బిజీగా ఉండగా ఈ సినిమా వేగంగా  తెరకెక్కిస్తున్నాడు.  ఇక ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్  సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్లాన్  సిద్ధం చేసిన్నట్లు తెలుస్తోంది. 2023 లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా  వచ్చే అవకాశం ఉంది.  ఇకపోతే సాధారణంగా ప్రశాంత్ నీల్ అదిరిపోయే యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ తో సినిమా అనేసరికి ఎలా ఉంటుందో అని  ప్రేక్షకులూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: