సలార్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా..!?
అయితే ప్రస్తుతం కేజీఎఫ్ హీరో యశ్ రిజెక్ట్ చేసిన సినిమాను ప్రభాస్ ఓకే చేశారంటూ వస్తున్న వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కథను 4 సంవత్సరాల క్రితమే యశ్ కు చెప్పాడట. అయితే ప్రశాంత్ నీల్ యశ్‌కు కేజీఫ్, సలార్ రెండు కథలు వినిపించారంట. కానీ యశ్ మాత్రం కేజీఎఫ్‌ను ఓకే చేసిన సలార్ కథను రిజెక్ట్ చేశారంట. ఆ తరువాత కేజీఎఫ్ ఎంతటి విజయం అందుకుందో అందిరికీ తెలిసిన విషయమే.
దాంతో ప్రశాంత్ నిల్ తన రెండో కథలో కొన్ని మార్పులను చేసి ప్రభాస్‌కు వినిపించారంట. కథ ప్లాట్ నచ్చడంతో ప్రభాస్ వెంటనే ఒకే చేశారు. ప్రస్తుతం ఈ సినిమా సలార్ శరవేగంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అభిమానులు రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్‌గా కనిపించబోయే ప్రభాస్‌కు రివేంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ముంబై మాఫియాను కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్‌లో కూడా ముంబై మాఫియా ఉంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్‌లో బాలీవుడ్ నటులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఉగ్రం రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతుంది.