విజయ్ సుకుమార్ సినిమా...స్టొరీ లైన్ అదేనా?
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ ఒకలా కనిపిస్తే గీతా గోవిందం సినిమాలో మరోలా కనిపించాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ల సరసన చాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం డైరెక్ట్ర్ పూరీ జగన్నాత్ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగానే సుకుమార్ విజయ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా డిఫరెంట్ స్టోరీతో వస్తోందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓ యుద్దం నేపథ్యంలో ఉండబోతుందట. ఇప్పటికే ఈ స్టోరీలైన్ ను సుక్కు విజయ్ కి చెప్పాడట. ఇక ప్రస్తుతం సుకుమార్ బన్నీతో పుష్ప ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరవాత ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తాడట. దాని తరవాత విజయ్ సినిమాను పట్టాలెక్కిస్తాడట.