మరొకసారి మహేష్ తో నటించనున్న అల్లరి నరేష్ ... ఏంటి నిజమే ....??

GVK Writings
మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా రెండేళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ హిట్ గా నిలిచింది. అంతకముందు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను మూవీ చేసిన మహేష్ బాబు, దానితో మంచి సక్సెస్ ని అందుకుని బాగా పేరు సంపాదించారు. ఇక మహర్షి కూడా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు లో మరింత జోష్ పెరిగింది. రిషి అనే పాత్రలో తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో సూపర్ స్టార్ మహేష్ ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా మంచి పేరు దక్కించుకున్నారు. స్టూడెంట్ గా, సాఫ్ట్ వెర్ కంపెనీ సిఈఓ గా అలానే రైతుల కోసం పోరాటం చేసే యువకుడిగా మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రని ఈ మూవీలో మహేష్ పోషించారు.

ఇక ఈ మూవీ యొక్క సక్సెస్ కి ముఖ్య కారణాల్లో ఒకటి దర్శకుడు వంశీ పైడిపల్లి రాసుకున్న ఆకట్టుకునే కథ, కథనాలు, అలానే హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర కూడా మహర్షి లో ఆడియన్స్ ని ఎంతో అలరిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మూవీలో మహేష్ బాబు స్నేహితుడిగా రవి అనే పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన సహజ నటనతో ఆడియన్స్ మనసు దోచుకున్నారు. మహేష్, నరేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించిన ఈ మూవీ అల్లరి నరేష్ కి కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందించింది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో మరొక్కసారి మహేష్ మూవీ లో అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్ర చేయనున్నారని అంటున్నారు. 

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తోన్న మహేష్ దాని అనంతరం యువ దర్శకడు అనిల్ రావిపూడి తో ఒక క్రికెట్ బేస్డ్ మూవీ చేయనున్నారని, అందులోని ఒక కీలకమైన పాత్రని చేయడానికి అల్లరి నరేష్ ఒప్పుకున్నారని అంటున్నారు. ఇటీవల ఈ పాత్ర విషయమై అల్లరి నరేష్ ని కలిసి కథ వినిపించి ఆయన కాల్ షీట్స్ కూడా తీసుకున్నారట దర్శకుడు అనిల్. కాగా ఈ మూవీ పై అధికారిక న్యూస్ అతి త్వరలో రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మరొక్కసారి వెండితెర పై మహేష్, నరేష్ ల జోడీని చూడవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: