అను ఇమ్మాన్యుయేల్ ఎవరితో డేటింగ్ చేస్తోందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇదిలా ఉండగా.. చాలా కాలం నుంచీ అను కోలీవుడ్ లోని ఒక డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి. తమిళ్ సినీ ఇండస్ట్రీ లో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఏ ఎమ్ జ్యోతికృష్ణ తో డేటింగ్ చేస్తోందట అను ఇమ్మాన్యుయేల్. అంతేకాకుండా ఈ డైరెక్టర్ తెలుగులో 2017 లో వచ్చిన "ఆక్సిజన్ " సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో అను హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే..
ఈ సినిమా షూటింగ్ సమయంలో తొలుత వీరిద్దరి మధ్య స్నేహం కుదిరి, చివరకు ఆ స్నేహం కాస్త ప్రేమ వైపు అడుగులు వేసింది. అలా స్నేహితులు గా మొదలైన వీరిరువురి పరిచయం ప్రేమగా మారిందని చెబుతున్నారు విశ్వసనీయ వర్గాలు. డైరెక్టర్ ఏ ఎమ్ జ్యోతికృష్ణ ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం కుమారుడు.అయితే డైరెక్టర్ ఏ ఎమ్ జ్యోతికృష్ణ కు గత 9 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల చేత వారు విడిగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ తరుణంలోనే డైరెక్టర్ ఏ ఎమ్ జ్యోతికృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ తో ఎఫైర్ పెట్టుకోవడం తో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారో, లేదో వేచి చూడాల్సిందే.. మరో పక్క అనూ అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించి, సందడి చేసిన విషయం తెలిసిందే.. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలించింది. ఇప్పుడు మరోసారి శర్వానంద్ నటిస్తున్న " మహా సముద్రం " సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ సారైనా ఈ ముద్దుగుమ్మ సక్సెస్ సాధిస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే..