మేకప్ లేకపోయినా మెరిసిపోతున్న బేబమ్మ..!
ఉప్పెన హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి సినిమా ప్రమోషన్స్ లో కూడా బాగా పాటిస్పేట్ చేస్తుంది. హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు కలిపి సినిమాకు మంచి ప్రమోట్ చేస్తున్నారు. సినిమా సక్సెస్ అవడంతో ఈ ప్రమోషన్స్ హంగామా మరింత ఎక్కువైంది. ఉప్పెన సినిమాతో బాగా పాపులర్ అయిన కృతి శెట్టి ఎక్కడ కనిపించినా ఆమెను బేబమ్మా అని పిలుస్తున్నారట. సినిమాలో ఆమె పాత్రతో అమ్మడు అంతగా మెప్పించిందని చెప్పొచ్చు.
ఇక మేకప్ ఉంది కాబట్టి కృతి శెట్టి అంత అందంగా ఉండొచ్చని అనుకోవచ్చు అమ్మడు మేకప్ లేకున్నా సరే నాచురల్ బ్యూటీలానే అందంగా ఉంది. కొందరికి మేకప్ ఉన్నా లేకున్నా ఇంప్రెసివ్ గా ఉంటారు. అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కృతి శెట్టి తన మేకప్ లెస్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. ఉప్పెన తర్వాత కృతి శెట్టి నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడతాయని చెప్పొచ్చు.