ప్రభాస్ ఏం పాపం చేశాడనీ..!
ఈ టీజర్ లో యూరప్ అందాలను లాంగ్ షాట్ లో పిక్చరైజ్ చేసి ట్రెయిన్ పాసింగ్ చూపించారు. వెంటనే రైల్వే కంపార్ట్ మెంట్, ప్లాట్ ఫారమ్ పై హీరోయిన్ ప్రేరణను ఫాలో అవుతూ హీరో ఎగురుతూ ఇటాలియన్ లాంగ్వేజ్ లో డైలాగ్ డెలివరీ చేస్తూ ఫ్లర్ట్ చేసే రష్ కట్ ను వదిలారు.ఇది యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ గా మేకర్స్ భావించారు.
వాలంటైన్స్ డే కు ఇచ్చిన టీజర్ లో ప్రేరణ పాత్రదారి పూజా హెగ్డే .. కథానాయకుడిని ఉద్దేశిస్తూ నువ్వేమైనా రోమియోవా అంటూ చేసిన డైలాగ్ కు... "ప్రేమ కోసం చచ్చే టైపు కాదంటూ" ఇచ్చిన కౌంటర్ డైలాగ్ ను స్వీట్ గా చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే పూజా హెగ్డే ఉన్నంత బ్యూటిఫుల్ గా చూపించిన ఫ్రేమ్ లో ప్రభాస్ లేకపోవడం సినిమాకు మైనస్ గా చెప్పవచ్చు. సాహో విషయంలో ప్రభాస్ గ్లామర్ మ్యాటర్ లో తీసుకొని కేర్ గురించి ఎన్నో కామెంట్స్ వచ్చి పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ లోను ఇదే డ్రాబ్యాక్ కనిపించడంతో సోషల్ మీడియాలో కామెంట్స్ పెరిగిపోతున్నాయి. కమింగ్ డేస్ లో వచ్చే ట్రైలర్ తో ఈ డ్రాబ్యాక్ ను సెట్ చేసుకుంటారేమో చూడాలి.