సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యాన్వల్ కాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్ ఎమోషనల్...మా కుటుంబం ఇద్దరిని కోల్పోయింది

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు వార్షికోత్సవ సమావేశాన్ని జరుపుకుంటున్నారు . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎన్టీఆర్ సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను జండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా సీపీ సజ్జాన్నార్ నేతృత్వంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఎన్టీఆర్ తో పాటు, ట్రాఫిక్ డీజీపీ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ. ...తాను ఈ కార్యక్రమానికి నటుడిగా రాలేదని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబీకులను కోల్పోయిన బాధితుడిగా వచ్చానని అన్నారు. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా వాహనాలను నడిపే మా అన్న జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని అన్నారు .

అలాగే 33 వేల కిలోమీటర్లు మా తాత ఎన్‌టీఆర్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రమాదం జరగకుండా నడిపిన మా నాన్న హరికృష్ణ ఇదే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని ఎమోషనల్ అయ్యారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పొంచి ఉంటాయని..ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు దయచేసి కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకోండని అన్నారు. మీ రాక కోసం ఎదురు చూసే వారిని గుర్తు తెచ్చుకోండని చెప్పారు. శిక్షలు వేసినంత మాత్రాన మార్పు రాదని..బాధ్యతగా మనల్ని మనం మార్చుకున్నప్పుడే మార్పు వస్తుందన్నారు. పౌరులందరూ సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాధ్యతారహితంగా పౌరులు ప్రవర్తించవద్దని అన్నారు. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకుంటామో అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులు చేతిలో లాఠీ ఉంది దండించడానికో, శిక్షించడానికో కాదు మనల్ని సన్మార్గంలో నడిపించడానికని అన్నారు.  తల్లిదండ్రులను మనం ఎలా గౌరవిస్తామో పోలీసులను అదే విధంగా గౌరవించాలని చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: