స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం తో దూసుకొస్తున్న పాన్ ఇండియా స్టార్...!!
ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న " రాధేశ్యామ్" లో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుంటే, పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా నటిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇద్దరు సంగీత డైరెక్టర్లు అవసరమయ్యారు. ఈ సినిమాకు హిందీలో మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందించగా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు.సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ, సచిన్ ఖేద్‌కర్, ప్రియదర్శి, సాషా చెట్రి వంటి సీనియర్ నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు.
ప్రభాస్ "సాహో" విడుదలైన దాదాపు రెండేళ్ల తర్వాత "రాధేశ్యామ్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వేలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన 'రాధేశ్యామ్' మూవీ గ్లిమ్స్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణ విక్రమాదిత్య రైల్వే ఫ్లాట్‌ఫామ్ మీద జనసందోహం మధ్యలో ఉన్న ప్రేయసికి విదేశీ భాషలో లవ్ ప్రపోజ్ చెయ్యగా ,"నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా'.అంటే..విక్రమాదిత్య.. 'ఛ, వాడు ప్రేమకోసం చచ్చాడు.నేను ఆ టైప్ కాదు'.. అంటూ ప్రభాస్ తన ప్రేమని తెలియజేసే గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. అంతకుమించి ఈ గ్లిమ్స్‌లో వేరే విజువల్స్ ఏమీ లేవు. కానీ ఆ రెండే రెండు డైలాగ్స్‌తో విక్రమాదిత్యగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏమిటనేది చెప్పేశాడు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. ఇప్పటికే ఈ మూవీపై పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రాబోయే రోజుల్లో సాంగ్స్, టీజర్, ట్రైలర్స్‌తో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో, వేచి చూడాలి మరి.