ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు టీజర్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి చివరి సారిగా "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ఎంతో ఘనవిజయం సాధించింది.చిన్న సినిమాగా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విమర్శకులను సైతం ఎంతో మెప్పించింది. ఇక ఈ సినిమాతో మంచి పేరునే సాధించాడు.హిందీలో కూడా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.మంచి మంచి పాత్రలు చేసుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ 'జాతిరత్నాలు'. స్వప్న సినిమా బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు అనుధీప్‌ కేవీ దర్శకత్వం వహిస్తుండగా.. ఫరీదా హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
 తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. చాలా సరదాగా ఉంది. టీజర్ మొత్తం కూడా కామెడీతో నిండిపోయింది. ముగ్గురు స్నేహితుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారని టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిల కామెడీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ తోనే నవ్వులు కురిపించారంటే.. సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు రథన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి కాని రాజకీయ వార్తల గురించి కాని ప్రతి విషయం గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: