ఆడియన్స్ కి ఊహించని సర్ప్రైస్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్.. కొత్త ప్లాన్ ఇదేనా..?

praveen
బుల్లితెరపై ఎన్ని రోజుల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఎంతో మంది కొత్త కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ అందరూ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా అటు వెండి తెరపై కూడా ఎన్నో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం తమదైన శైలిలో కామెడీ పంచుతూ దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ద్వారా తమకు వచ్చిన క్రేజ్ బేస్ చేసుకుని కొంతమంది ఇతర షో లకు  వెళ్తుంటే మరికొంతమంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.


 ఇప్పటికే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్స్ సినిమాల్లోకి వెళ్లి మంచి సక్సెస్ సాధించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ తనదైన కామెడీని పంచుతూ టాప్ టీమ్  లీడర్ గా కొనసాగుతున్న బుల్లెట్ భాస్కర్ వీరందరికీ భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటే బుల్లెట్ భాస్కర్ మాత్రం సీరియల్స్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.



 ఇటీవలే జీ తెలుగులో ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించిన కల్యాణ వైభోగమే అనే సీరియల్లో బుల్లెట్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చి అభిమానులు అందరికి కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ సీరియల్ లో పోలీస్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్.. ఫస్ట్ ఎపిసోడ్ లో కొంత సమయం పాటు కామెడీని పండించాడు.  ఈ క్రమంలోనే బుల్లెట్ భాస్కర్ ఎంట్రీ తో ఆడియన్స్ అందరూ సర్ప్రైస్ అయిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే బుల్లెట్ భాస్కర్ పాత్ర పూర్తిస్థాయిలో ఉంటుందా లేదా కేవలం 12 ఎపిసోడ్ లకు మాత్రమే పరిమితం అవుతుందా అన్నదానిపై బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: