ఉప్పెన సినిమా క్లైమాక్స్ ఏంటో తెలిసిపోయింది.. కానీ ఆడియన్స్ దీనికి ఒప్పుకుంటారా..??

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది వెండితెరకు హీరోలుగా పరిచయమయ్యారు.. ఇప్పుడు తాజాగా అదే మెగా కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు..మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ఉప్పెన..బుచ్చిబాబు దర్శ8తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది..ఇక ఇండ్రస్టీ లో  మిగిలిన వారసులకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వైష్ణవ్ తేజ్ సినిమా లాంచ్ అవుతుంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఉప్పెన సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

 ఫిబ్రవరి 12న వాలెంటైన్స్ డే వీకెండ్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో సంచలనం సృష్టించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ముఖ్యంగా అన్ని సినిమాల్లో సుఖాంతం చూస్తాం.. కానీ ఉప్పెన సినిమాలో మాత్రం విషాదాంతం చూస్తామని ముందు నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. టీజర్ చూసిన తర్వాత చాలా మందికి ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఇలాగే కట్ చేశారు. గొప్ప గొప్ప ప్రేమ కథ చరిత్రలో ఉండాలి కానీ పెళ్లి చేసుకొని ఇంట్లో పిల్లాపాపలతో కాదు అంటూ విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్ వింటుంటే...

 ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.పరువు హత్యల నేపథ్యంలో ఉప్పెన సినిమా తెరకెక్కింది. పెద్దింటి అమ్మాయిని పేదోడు ప్రేమిస్తే వాళ్ళు ఎలాంటి శిక్ష వేశారు అనేదాన్ని అందంగా, హృద్యంగా చెప్పబోతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. అయితే తెలుగులో విషాదాంత ప్రేమ కథలు విజయం సాధించడం చాలా అరుదు. అయినా కూడా తమ కథపై నమ్మకంతో వస్తున్నారు ఉప్పెన టీమ్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. మరోవైపు ఉప్పెన కోసం భారీ టెక్నికల్ టీం పని చేయడంతో ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: