పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

NAGARJUNA NAKKA
చిరంజీవి సినిమాలకి బ్రేక్ ఇచ్చాక పవన్‌ కళ్యాణ్, మహేశ్ బాబు ఇద్దరూ టాప్‌ ఛైర్‌ కోసం పోటీ పడ్డారు. అయితే కొంతమంది పవన్ నం.1 అంటే, మరికొంతమంది మహేశ్‌ నం.1 అని పోస్టులు పెట్టారు గానీ, బాక్సాఫీస్‌ ఎవరికీ ఓటెయ్యలేదు. ఈ పోటీ సాగుతుండగానే పవన్‌ పాలిటిక్స్‌లోకి వెళ్లిపోయాడు. తర్వాత రేస్‌ కూడా చల్లబడిపోయింది.

పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ 'వకీల్‌సాబ్'తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలకి సైన్ చేశాడు. అందులో క్రిష్‌ డైరెక్షన్‌లో చేస్తోన్న పీరియాడికల్ డ్రామా ఒకటి. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ పాన్‌ ఇండియన్ పీరియాడికల్ డ్రామా 2022 సంక్రాంతికి వస్తుందని సమాచారం.
స్పాట్: పవన్, క్రిష్ మూవీ పోస్టర్

మహేశ్ బాబు ఆల్రెడీ సంక్రాంతి రేసులో ఉంటున్నానని అనౌన్స్‌ చేశాడు. వచ్చే ఏడాది పొంగల్‌కి 'సర్కారు వారి పాట' రిలీజ్‌ చేస్తామని ప్రకటించాడు. బ్యాంక్‌ స్కామ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో పొలిటికల్‌ సెటైర్లు ఏమైనా ఉంటాయా అని ఆడియన్స్‌తోపాటు, పొలిటికల్‌ పీపుల్ కూడా గమనిస్తున్నారు. ఈ సినిమాకే పోటీగా దిగుతున్నాడు పవన్.

పవన్‌ కళ్యాణ్, మహేశ్ బాబు ఇంతకుముందు కూడా నెక్‌ టు నెక్‌ ఫైటింగ్‌కి దిగారు. థియేటర్ల దగ్గర కలెక్షన్ల వార్‌ చేశారు. మరి పాతఫైటింగుల్లో ఎవరు పై చేయి సాధించారు.. హిస్టరీ ఎవరికి అనుకూలంగా ఉంది, ఫ్యూచర్‌ వార్‌ ఎలా ఉండబోతోంది?
పవన్‌ కళ్యాణ్, మహేశ్ బాబు ఇంతకుముందు రెండు సార్లు వారం గ్యాప్‌లో సినిమాలు రిలీజ్ చేశారు. ఇరవైయేళ్ల క్రితం రెండు వేల సంవత్సరంలో మహేశ్ బాబు ఏప్రిల్‌ 14న 'యువరాజు' రిలీజ్ చేస్తే, పవన్‌ ఏప్రిల్‌ 20న 'బద్రి'తో వచ్చాడు. ఈ ఫస్ట్ ఫైట్‌లో పవన్‌ విన్నర్‌గా నిలిచాడు.

పవన్, మహేశ్ రెండోసారి 2006లో పోటీపడ్డారు. ఏప్రిల్ 28న మహేశ్ బాబు 'పోకిరి'తో బ్లాక్‌బస్టర్‌ కొడితే, వారం గ్యాప్‌లో మే 3న వచ్చిన పవన్‌ కళ్యాణ్ 'బంగారం'కి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇలా నెక్‌ టు నెక్‌ ఫైట్‌లో ఒకటి-ఒకటితో నిలిచిన పవన్, మహేశ్ మళ్లీ ఇప్పుడు పోటీపడుతున్నారు.

సంక్రాంతి ఫెస్టివ్‌ సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా, టికెట్‌ సేల్స్‌ బాగానే ఉంటాయి. పండగ హాలిడేస్‌లో ఫ్యామిలీ మొత్తం థియేటర్ల వైపు కదులుతుంటారు కాబట్టి, మ్యాగ్జిమమ్ హౌస్‌ఫుల్‌ అవుతాయి. కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో పెద్దగా డిఫరెన్స్‌ ఉండకపోవచ్చు. కానీ టోటల్‌ కలెక్షన్స్‌లో ఎవరు ఎక్కువ కలెక్ట్‌ చేస్తారు అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: