వివాదాస్ప‌ద గురువు, బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్‌ల‌పై మూత్రం చల్లిన స్వామి మృతి...?

VAMSI
తరచు వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వామి ఓమ్ అనారోగ్యంతో బుధవారం తన చివరి శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. త‌న‌ను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటూ పలు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండే స్వామి ఓమ్.. హిందీ బిగ్ బాస్ సీజన్ 10  లో ఒక కంటెస్టెంట్ గా వెళ్లారు. ఆ షోకి కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. అలా బి బి 10 లో పాల్గొన్న స్వామి కొన్ని అనాలోచిత పనుల వలన వివాదాల్లో చిక్కుకొని.. ఎలిమినేట్ కాకముందే హౌస్ నుండి బయటకు వచ్చేశారు.

హిందీ బిగ్ బాస్ షోలో తన తోటి ఇంటి సభ్యులైన బాని జీ, రోహ‌న్ మెహ్రాల‌పై మూత్రం చ‌ల్లారు. ఇది అప్పట్లో సంచలన వార్తగా నిలిచింది. ఈ వివాదం చివరికి ఆయనను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లే పరిస్థితికి దారి తీసింది. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ల్మాన్ ఖాన్.. అత‌డిని షో నుంచి వెంట‌నే బ‌య‌ట‌కు పంపారు. ఆ తర్వాత కూడా ఈ వివాదం కొద్ది రోజుల పాటు కొనసాగింది. అంతే కాదు ఆయన పై పలు కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. 2008లో స్వామిపై అత‌డి సోద‌రుడు ప్ర‌మోద్, తన షాపును స్వామి కూల్చేశాడని కేసు పెట్టాడు. అలాగే 2017లో స్వామి ఓమ్, అత‌డి స్నేహితుడితో క‌లిసి ఒక మహిళను వివ‌స్త్ర‌ను చేసి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడింది. ఇలా పలు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఇదిలా ఉండగా, 3 నెలల క్రితం స్వామి ఓమ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ తర్వాత కెన్నీ రోజుల తరువాత కరోనా నుండి కోలుకున్నారు కానీ... పలు సైడ్ ఎఫెక్ట్ ల బారిన పడ్డారు. ఈ క్రమంలో గత 15 రోజుల నుండి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కాగా చివరికి మృత్యువుతో పోరాడి గెలవలేక అనంతలోకాలకు చేరిపోయారు. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా ఫేమస్ అవుతారు. అది మంచిగా కావొచ్చు లేదా చుడుగా కావొచ్చు. కానీ ఈ స్వామి మాత్రం బ్రతికినంత కాలం వియ్యదల మధ్యనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: