సమంత కోసం వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న గుణశేఖర్..!!
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సినిమా కోసం భారీ సెట్స్ రూపొందుతున్నాయి.దీంతో పాటు ఈ సినిమాలో శంకుతల పాత్రలో నటించబోయే సమంత కోసం ప్రత్యేకమైన చీరలను సిద్ధం చేస్తున్నాడట గుణశేఖర్. అప్పట్లో నార చీరలు కట్టుకునేవారు. మరి అలాంటి చీరలను గుణశేఖర్.. ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడు.మహాభారతం ఆదిపర్వంలోని దుష్యంతుడు, శకుంతల ప్రేమకథను ఆధారంగా చేసుకుని ఈ శాంకుతలం సినిమాను తెరకెక్కిస్తుననాడు. శకుంతలత పాత్రను సమంత అక్కినేని పోషిస్తుంది. మిగిలిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అవుతుందని సమాచారం అందుతోంది.. ఇక గతంలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత హిస్టారికల్ ప్రాజెక్ట్ లో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి..ఇక ఈ సినిమాతో పాటు పలు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది సమంత.. తాజగా ఈమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్2 త్వరలోనే విడుదల కానుంది..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ మీ తప్పకుండా ఫాలో అవ్వండి..!!