ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భామ పునర్నవి భూపాలం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసింది పున్నూ. కానీ హీరోయిన్ అవికా గోర్ కంటే పున్నూనే ఎక్కువమంది మనసులను దోచుకోవడం విశేషం. ఇక ఈ సినిమా తరువాత కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా పెద్ద సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించి అలరించింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా నటించినా రాని గుర్తింపు ఈ భామకు బిగ్ బాస్ సీజన్ 3 తో వచ్చింది. బిగ్ బాస్ లో పున్నూ ముక్కు మీద కోపం ఉన్న అమ్మాయిలా కనిపించడంతో ఆమెకు కుర్రకారు ఫిదా అయ్యారు. అంతే కాకుండా బిగ్ బాస్ లో రాహుల్ పున్నూ ల కెమిస్ట్రీ కి కూడా ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. దాంతో హౌస్ నుండి భయటకు వచ్చాక కూడా వీళ్లిద్దరూ టీవి షోలలో సందడి చేసారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పునర్నవి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. యాంకర్ మీరు ఎప్పుడైనా డేట్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా...తను ఎప్పుడూ డేట్ కి వెళ్లలేదని కానీ తన ఫోటోలు డేటింగ్ యాప్ లో ఉన్నాయని. తార, హాసిని పేర్లతో ఫోటోలు ఉన్నాయని చెప్పింది. ఆ విషయం తన స్నేహితుల ద్వారా తెలిసిందని వెల్లడించింది. తనకు అసలు ఆ యాప్ తెలియదని. అంతే టైమ్ కూడా ఉండదని చెప్పింది. ఇక ప్రస్తుతం పునర్నవి వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా వుంది. ఆహా లో పునర్నవి నటించిన కమిట్మెంటల్ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా పున్నూ తనకు భార్గవ్ తో ఎంగేజ్మెంట్ అయినట్టు డ్రామా ఆడింది దాంతో ఈ సిరీస్ ఫుల్ పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: