నేను అన్ని రంగాలలో విజయం సాధించడానికి గల కారణం అతనే : మురళీమోహన్

Divya
మురళీమోహన్ సినీ ఇండస్ట్రీలోకి మొదటగా హీరోగా అడుగు పెట్టి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మురళీమోహన్ ఇండస్ట్రీలోకి మొదట అడుగు పెట్టినప్పుడు మొత్తం 50 సినిమాలకు పైగా హీరోగా నటించాడు.కానీ ఆ తర్వాత హీరోగా వరుసగా ఫెయిల్యూర్స్ రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్  వైపు మొగ్గు చూపాడు. అయితే అలా 350 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు.  అయితే మురళీమోహన్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి,జయభేరి ప్రొడక్షన్స్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన "అతడు " సినిమాకు  కూడా మురళీమోహన్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా ఇప్పటికీ టీవీలో మాత్రం మంచి టీఆర్పీ రేటింగును సాధిస్తోంది.
ఇదిలా ఉండగా మురళీమోహన్ వ్యక్తిగత జీవితానికి వస్తే 1940 వ సంవత్సరంలో స్వతంత్ర సమరయోధులు అయిన మాగంటి మాధవరావు అనే అతనికి జన్మించాడు. ఈయన బాల్యం,చదువు మొత్తం ఏలూరులోనే  ముగిసింది. ఆ తరువాత 1963వ సంవత్సరంలో తను సొంతంగా ఎలక్ట్రికల్ మోటార్ తో పాటు ఆయిల్ ఇంజన్స్  బిజినెస్ ని ప్రారంభించాడు.  ఇక ఆ తర్వాత మెల్లిగా ఆయన దృష్టి నాటకాల వైపు వెళ్లడంతో విజయవాడలోని స్టేజ్ పై షోస్ఇవ్వడం ప్రారంభించాడు.మురళీమోహన్ డైరెక్టర్ అట్లూరి పూర్ణచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "జగమే మాయ" అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన "తిరుపతి" అనే సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ప్రెసిడెంట్ గా పనిచేసి తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించాడు.

మురళీమోహన్ విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి,ఒక అబ్బాయి. అమ్మాయి పేరు బిందుమాధవి  కాగా అబ్బాయి పేరు రామ్ మోహన్. మురళీమోహన్ 2014 వ సంవత్సరంలో లోక్ సభ సీట్  గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక మురళీమోహన్ కేవలం నటుడు,రాజకీయవేత్త, నిర్మాత  మాత్రమే కాకుండా పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. హైదరాబాద్ లోని టాప్ టెన్ వ్యాపారవేత్తలలో  మురళీమోహన్ ముందుంటారు. ఇలా  వ్యాపార రంగంలో అంత  స్థాయిలో సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఆయన కొడుకు రామ్ మోహన్. మురళీమోహన్ కు సంబంధించిన వ్యాపారాలన్నీ రామ్ మోహన్  చూసుకుంటున్నాడు.
మురళీమోహన్ తన పేరుమీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఈ ట్రస్టు ద్వారా ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. ఇక  ఈ ట్రస్టు ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: