సాక్షి వైధ్య అయిన అఖిల్ కి హెల్ప్ అవుతుందా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా సొంతం చేసుకోలేదు. వరుస ప్లాపులతో తెగ సతమాతమవుతున్నాడు. ఒక్క హిట్ కోసం అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాని మనోడికి హిట్ అనేది ఇప్పుడు అందని ద్రాక్షాగా మారింది. అందుకే ఈసారి ఎలా అయిన మంచి హిట్ కొట్టాలని తన తాజా సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ‌ మనోడు. ఇక అఖిల్ తాజా సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ ఇంకా ఓ రూపు దిద్దుకోకముందే కొత్త సినిమా పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఓవైపు ‘బ్యాచిలర్‌’ రీ షూట్లు సాగుతుంటే.. మరోవైపు సురేందర్‌ రెడ్డి సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కొలిక్కి తెస్తున్నారు. తాజాగా సినిమాలో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌ చేశారట. చాలా రోజులుగా హీరోయిన్‌ గురించి వెతుకుతూ వస్తున్న చిత్రబృందం ఫైనల్‌ చేసిందట. గత కొద్ది వారాలుగా పుకార్లుగా వినిపిస్తున్న సాక్షి వైధ్యను ఫైనల్‌ చేసేశారట.

అఖిల్‌ ఐదో సినిమాగా సురేందర్‌ రెడ్డి సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చివరిదశకు వచ్చిందట. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపిక కూడా ఓకే చేసేస్తున్నారట. దీని కోసం ఆడిషన్స్‌ పూర్తి చేసి సాక్షి వైధ్యను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఆమెపై టెస్ట్‌ షూట్‌ కూడా చేశారట. ‘బ్యాచిలర్‌’ విషయంలో హీరోయిన్‌ ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. అఖిల్‌కు పూజ అక్కలా ఉందంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ సినిమా విషయంలో జాగ్రత్తపడి ఫ్రెష్‌ ఫేస్‌ను తీసుకొస్తున్నారట. గత చిత్రాల ఫలితాలు, ఎంపికను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ఓకే చేశాడట అఖిల్‌.
సూరి సినిమాలంటే యాక్షన్‌, ఎంటర్‌టైన్మెంట్‌ కలగలిపి తెరకెక్కిస్తాడు. మరి ఇప్పటివరకు ఎలాంటి జోనర్‌లో ఫిక్స్‌ కాకుండా, ప్రయత్నాల్లో ఉండిపోయిన అఖిల్‌కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: