మహేష్, పవన్ లు మొదలు పెట్టేశారుగా.. బాక్సాఫీస్ బద్దలే..?
మరోవైపు మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా కోసం రెడీ అవుతున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు.. లుక్ ఎంతో రెఫ్రెషింగ్ గా ఉందని, డెఫినెట్ గా ఫాన్స్ కి మహేష్ ట్రీట్ ఇస్తున్నాడని అంటున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది..
అయితే కరోనా లాక్ డౌన్ వల్ల పది నెలల దాకా సుదీర్ఘ విరామం తీసుకున్న టాలీవుడ్ గత రెండు నెలలుగా షూటింగులతో యమా సందడిగా మారింది. స్టూడియోలు కళకళలాడుతున్నాయి. థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. జనం సాధారణ స్థితికి వచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎడాపెడా రిలీజు ప్రకటనలు కూడా వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల షూట్లలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఫైనల్ గా అందరూ సెట్లలో అడుగు పెట్టేశారు. ఇప్పటిదాకా వెయిటింగ్ లో ఉన్న మహేష్ బాబు సైతం దుబాయ్ లో తన సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ని ఇవాళ నుంచే స్టార్ట్ చేశారు. మైత్రి నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇలా టాలీవుడ్ అగ్రే హీరోలిద్దరూ ఒకేరోజు క్రేజీ ప్రాజెక్టుల రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోవడం కన్నా హ్యాపీ న్యూస్ ఇంకేముంటుంది.