చిరంజీవి సరసన ఆ బ్యూటీ..?

NAGARJUNA NAKKA
ఆచార్య సినిమాలో చిరంజీవికి జోడీ కాజల్‌ అయితే.. రామ్‌చరణ్‌ హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్న చాలాకాలంగా సస్పెన్స్‌లోనే ఉంది. చాలా పేర్లు బయటికొచ్చినా.. చివరికి క్రేజీ హీరోయిన్నే సెలెక్ట్‌ చేశారు. చెర్రీతో ఆడిపాడే ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..  

పూజా హెగ్డే మరోసారి మెగా కాంపౌండ్‌లో చేరింది. ఎప్పుడు చూసినా.. ఎవరో ఒక మెగా హీరోతో ఆడిపాడాల్సిందే. "ముకుందా'తో ఎంట్రీ ఇచ్చి... గద్దలకొండ గణేష్‌తో వరుణ్‌తో రెండుసార్లు  జత కట్టింది. బన్నీతో 'దువ్వాడ జగన్నాథమ్‌'.. అల వైకుంఠపురంలో చేసింది పూజా. ఇక రంగస్థలంలోని ఐటంసాంగ్‌లో రామ్‌చరణ్‌తో  చిందులేసింది.

బన్నీ, వరుణ్‌తేజ్‌తో రెండుసార్లు నటించిన పూజా ... ఈ స్కోర్‌ను రామ్‌చరన్‌తో లెవెల్‌ చేస్తోంది. రంగస్థలం తర్వాత ఆచార్యలో సెట్‌లోకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఆచార్య సినిమాలో రామ్‌చరన్‌ను అనుకున్నాక.. హీరో క్యారెక్టర్‌ పెంచి 40 నిమిషాలకు తీసుకొచ్చారు. ఇందులో సగం హీరోయిన్‌కు ఇచ్చారు. ముందు చెర్రీకి జోడీగా కియారా అద్వానీ పేరు వినిపించింది. ఇప్పటికీ.. హీరోయిన్ని ఎనౌన్స్‌ చేయకపోయినా.. పూజా హెగ్డే పేరు దాదాపు ఖరారయిందట.
తెలుగులో నయనతార తర్వాత ఎక్కువ తీసుకుంటున్న హీరోయిన్‌ పూజా హెగ్డేనే. అల వైకుంఠపురంలో హిట్‌ తర్వాత 3 కోట్లు డిమాండ్‌ చేస్తున్నా.. ఆచార్య పాత్ర నిడివి తక్కువే కాబట్టి.. కోటి తీసుకుందన్న టాక్‌ నడుస్తోంది. మెగా బేనర్‌ కావడంతో...  డిమాండ్‌ చేయలేదని తెలిసింది. దర్శకుడు కొరటాల ప్రస్తుతం రామ్‌చరణ్‌పై సన్నివేశాలను తీస్తున్నాడు. ఫిబ్రవరినాటికి ఆచార్య షూటింగ్‌ పూర్తవుతుంది.

మొత్తానికి పూజా హెగ్డే మెగాస్టార్ ఆవరణలోకి వెళ్లిపోయింది. ఇక ఆ వారసులతో ఆడిపాడేందుకు సిద్ధమయింది. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ఆడి పాడిన ఈ అమ్మడు.. బన్నీతో కూడా చిందులేసింది. అంతేకాదు రంగస్థలంలో ఐటం సాంగ్ తో కుర్రకారు మతిపోగొట్టింది.

మొత్తానికి పూజా హెగ్డే చిరంజీవితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమయింది. ఇప్పటికే వరుణ్, బన్నీ, రామ్ చరణ్ తో జతకట్టిన ఈ బ్యూటీ చిరుతో ఎలా రొమాన్స్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: