బంగారు బుల్లోడు వచ్చినట్లు చాలామందికి తెలియదా..?
ఈ మూవీ లో అల్లరి నరేష్ కి జోడీగా పూజా జవేరి నటించగా.. గిరి పల్లిక దర్శకత్వం వచించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని నిర్మించారు. లాక్ డౌన్ సమయంలో ఓటిటి ఆఫర్ వచ్చినప్పటికీ..నిర్మాతలు మాత్రం థియేటర్స్ ల్లోనే రిలీజ్ చేయాలని ఈరోజు రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చాలామంది తెలియదు. ఎందుకంటే మొదటి నుండి కూడా నిర్మాతలు ఈ మూవీ ప్రమోషన్ విషయంలో కాస్త వెనుకడుగే వేశారు. అది కాక మార్కెట్ లో అల్లరి నరేష్ స్టామినా చాల తగ్గింది. ఈయన నుండి సరైన హిట్ చూసి కొన్ని ఏళ్లు అవుతుంది. ఒకప్పుడు నరేష్ నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ కామెడీ ఉంటుందని , థియేటర్స్ లలో కాసేపైనా నరేష్ కామెడీ తో బాధలు మరచిపోవచ్చని అనుకునే వారు. కానీ ఈ మధ్య మాత్రం నరేష్ సినిమా అంటేనే బోర్ గా ఫీల్ అవుతున్నారు. అది కాక కామెడీ కూడా చాల తగ్గింది. దీంతో నరేష్ నుండి కొత్త సినిమా అంటే ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదు. బంగారు బుల్లోడు విషయంలోనూ అలాగే జరిగింది.
గత సినిమాల ప్రభావం.. సినిమా ప్రమోషన్ సరిగా లేకపోవడం.. పాటలు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడంతో ఈ సినిమా గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా అసలు ఈ మూవీ ఈరోజు రిలీజ్ అవుతుందని కూడా చాలామందికి తెలియదు. ఇలా అన్ని కూడా ఈ సినిమా కు మైనస్ గా మారాయి.