అనసూయ ప్రోమో కోసమే అలా చేస్తుంది.. అసలు నిజం చెప్పేసిన రోజా..?
ఇకపోతే ఇటీవలే వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలవ్వగా ప్రస్తుతం ఈ ప్రోమో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోయింది. ఇటీవలే విడుదలైన ప్రోమో ఓ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అనే చెప్పాలి. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా సరికొత్త స్కిట్ తో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా కమెడియన్స్ కామెడీ స్కిట్ చేస్తున్న సమయంలో అటు జడ్జీల తో పాటు యాంకర్ ల పై కూడా పలు రకాల పంచులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఇటీవలే ప్రోమో లో భాగంగా అదిరే అభి స్కిట్ చేస్తున్న సమయంలో.. అనసూయను ఒక ప్రశ్న అడుగుతాడు. ఇక ఆసక్తికర సమాధానం చెబుతుంది అనసూయ. అనసూయ నీకు అన్ని బుక్కుల లో ఏ బుక్ అంటే ఎక్కువగా ఇష్టం అంటూ అదిరే అభి అడుగగా మా ఆయన చెక్ బుక్ అంటే ఎంతో ఇష్టం అంటూ చెబుతోంది అనసూయ.. ఇంత సంపాదిస్తున్న ఇంకా ఆయన చెక్ బుక్ పైనే కన్నేసింది అంటూ అదిరే అభి అనగానే.. ఏదో ప్రోమో కోసం అనసూయ అలా చెప్పిందని కానీ డబ్బులు మొత్తం అనసూయ చేతిలోనే ఉంటాయి అంటూ రోజా అసలు విషయం చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.