కార్తీతో జతకడుతున్న సెక్సీభామ

Prasad
తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ. ఈ యువ హీరో నటిస్తున్న కొత్త సినిమా బిర్యానీ. దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా హన్సిక నటిస్తుండగా, మరొక హీరోయిన్ గా నీతూ చంద్ర ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలో సుమంత్ మరదలిగా నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పద్ధతిగా కనిపించినా, మిగిలిన సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమ హాట్ హాట్ ఫోటోలతో సెక్సీ భామగా పేరు గడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: