అబ్బాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో..?

praveen
ఒకప్పుడు సినిమాల్లో స్టార్  హీరోలుగా వెలుగొంది ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వారు ఆ తర్వాత సినిమా అవకాశాలు రాక ఇక వెండితెరపై కనుమరుగైన హీరోలు ఎంతో మంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు పలు సినిమాలతో తెరమీదికి వచ్చినప్పటికీ ప్రేక్షకాదరణ కరువవడంతో చివరికి సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఇలా ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా లవర్ బాయ్ గా కొనసాగి  ప్రస్తుతం అవకాశాలు లేక పూర్తిగా వెండితెరపై కనుమరుగైన హీరో అబ్బాస్. అప్పట్లో అబ్బాస్ నటించిన సినిమాలకు ఎంత గుర్తింపు ఉండేదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అబ్బాస్  సినిమా వస్తుందంటే చాలు ముఖ్యంగా యువత ఎగబడి మరీ సినిమాలను చూసేవారు. ఇక అప్పట్లో ఎన్నో రొమాంటిక్ పాత్రలో నటించి లవర్ బాయ్ గా ఎంతో మంది యువకుల మనసులు కొల్లగొట్టాడు అబ్బాస్. ఆ తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో చివరికి వెండితెరపై క్రమక్రమంగా కనుమరుగు అవుతూ వచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా అవకాశాలు లేక వెండితెరపై కనుమరుగైన ఎంతో మంది నటులకు ప్రస్తుతం ఓటిటి  ఒక మంచి వేదికగా మారిపోయింది అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్ మరోసారి ఓటిటి  వేదికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటిటీ ప్లాట్ఫామ్ నుంచి  మంచి ఆఫర్లు వస్తున్నాయని ఈ క్రమంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాను అంటూ ఇటీవలే అబ్బాస్ చెప్పుకొచ్చాడు.  ఈ క్రమంలోనే అబ్బాస్ త్వరలో రీ ఎంట్రీ ఇవ్వాలి అని అటు అభిమానులు అందరూ ఎంతగానో కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే కేవలం అబ్బాస్ విషయంలోనే కాదు ఎంతోమంది నటుల విషయంలో ప్రస్తుతం ఓటిటి  ప్లాట్ఫామ్  ఒక మంచి వేదికగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లో కమర్షియల్ పాత్రలలో నటించి  ఎంతో మంది నటులు ఓటిటి  ప్లాట్ ఫామ్  లో వైవిధ్యమైన పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: