ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. ఇక ఇద్దరు తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్‌డమ్ అంటే ఏమిటో పరిచయం చేసారు. వీళ్లిద్దరు ఎన్నో సినిమాల్లోకలిసి పనిచేసారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి. ఆ సంగతి పక్కనపెడితే.. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు విడుదలైన కొన్ని రోజులకు ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ అప్పటికే పరుచూరి బ్రదర్స్ సహా  కొంత మంది కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూడమని అన్నగారికి చెప్పడంతో .. కృష్ణను పిలిపించి అల్లూరి సీతారామరాజు సినిమాను చూసి ఆయన్ని అభినందించారు ఎన్టీఆర్.
అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏఎన్నార్‌తో అన్నపూర్ణ స్టూడియో ప్రభుత్వం స్థలాన్ని ఆక్రమించి కట్టారనే విషయంలో పెద్ద ఇష్యూ నడిచింది. అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్.. అక్కినేనికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించి ప్రభుత్వ స్థలంలో ఉన్న గోడలను బుల్డోజర్‌తో పడగొట్టించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత ఎన్టీఆర్,ఏఎన్నార్ విభేదాలు పక్కన పెట్టి మళ్లీ ఒకటైపోయారు. ఇక ఎన్టీఆర్, కృష్ణ కూడా ఆ తర్వాత మళ్లీ కలిసిన సందర్భాలున్నాయి
ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మధ్య ఎన్ని గొడవలు ఉన్న వీళ్లు సినిమాల్లో కలిసి నటించిన సందర్భాలున్నాయి. ఈ జనరేషన్‌లో బాలకృష్ణ, చిరంజీవి మధ్య కొన్ని విషయాల్లో గొడవలు వచ్చాయి. అటు బాలయ్యకు, నాగార్జునకు కూడా ఓ విషయంలో విభేదాలు వచ్చాయి. గత కొన్నాళ్లుగా వీళ్లు అంత సఖ్యంగా లేరనే మాట ఇండస్ట్రీలో వినబడుతోంది. మొత్తంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ విభేదాలన్ని టీ కప్పులో తుపాను లాంటివే. ఈ విభేదాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్తేం కాదు. మొత్తంగా చూసుకుంటే ఈనాటి విభేదాలు ఏనాటివో అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: